రేపు హస్తినకు మంత్రుల బృందం

by Muthe.Rajitha |

తెలంగాణ మంత్రుల బృందం రేపు సాయంత్రం హస్తినకు బయల్దేరి వెళ్లనుంది.

రేపు హస్తినకు మంత్రుల బృందం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మంత్రుల బృందం రేపు సాయంత్రం హస్తినకు బయల్దేరి వెళ్లనుంది. ఏప్రిల్​2వ తేదీన ఢిల్లీలోని జంతర్​మంతర్​వద్ద బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నా చేపడుతున్నాయి. బీసీ సంఘాల ఆహ్వానం పిలువు మేరకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి పయనం అవుతున్నారు. ఏఐసీసీ అగ్రనేత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఇతర మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్,బిర్ల ఐలయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి , ఈర్లపల్లి శంకరయ్య, అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఢిల్లీలో బీసీ సంఘాల మహాధర్నాలో పాల్గొని సంఘీభావం తెలుపనున్నారని తెలిసింది.

తెలంగాణ శాసన సభలో ఇటీవల బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చేసిన చట్టాన్ని 9 వ షెడ్యూల్ చేర్చాలని, ఏప్రిల్ 2,3 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నాయకులను కలిసి తెలంగాణ చేపట్టిన కుల సర్వేను వివరించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కోరనుంది. ఏప్రిల్ 2,3 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహకారంతో వివిధ పార్టీ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వాలని కూడా తెలంగాణ కాంగ్రెస్ బృందం కోరనుంది.

Next Story