HYD: మహిళా జర్నలిస్టులకు ఘన సత్కారం

by Gantepaka Srikanth |

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో శ్రీఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు.

HYD: మహిళా జర్నలిస్టులకు ఘన సత్కారం
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో శ్రీఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ సమాజంలోని సమస్యలను వెలుగులోకి తెస్తున్న పలువురు మహిళా పాత్రికేయులను ఈ సందర్భంగా 'ఉమెన్ అచీవర్స్' పురస్కారాలతో గౌరవించారు. నగరంలోని మసాబ్ ట్యాంక్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో ట్రస్ట్ ప్రతినిధులు మరియు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. జర్నలిజం వంటి సవాలుతో కూడిన రంగంలో మహిళలు తమదైన ముద్ర వేయడం అభినందనీయమని వారు కొనియాడారు.

ఈ సందర్భంగా సత్కారం పొందిన ‘దిశ’ జర్నలిస్టు సుజిత మాట్లాడారు. ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు. తమ వృత్తిపరమైన ప్రయాణాన్ని గుర్తించి, ప్రోత్సహించినందుకు ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు. దాంతోపాటు వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్న ‘దిశ’ యాజమాన్యానికి ఈ సందర్భంగా సుజిత కృతజ్ఞతలు తెలిపారు.

Next Story