- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర విషాదం.. ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య కన్నుమూత
యోగా శిక్షకుడు, సాహితీవేత్త, రాజకీయ నాయకుడు సమాజ్‌వాదీ పార్టీ ముఖ్యనేత ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: యోగా శిక్షకుడు, సాహితీవేత్త, రాజకీయ నాయకుడు సమాజ్‌వాదీ పార్టీ ముఖ్యనేత ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచారు. కాగా, తాటికొండ వెంకటరాజయ్య జనగామ జిల్లా, తరిగొప్పుల మండల పరిధిలోని అంకుశాపురం గ్రామంలో 1957, ఫిబ్రవరి 20న జన్మించారు. ఆయన ఒకటి నుంచి 5వ తరగతి వరకు అంకుశాపురంలో, ఆరు నుంచి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ పాఠశాలో విద్యను అభ్యసించారు. వెంకటరాజయ్య హైదరాబాద్ సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ లో పీజీ పూర్తి చేశాడు. ఆయన 2017లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. తాటికొండ వెంకటరాజయ్య ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ శాసనసభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేశాడు. 2020లో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఎమ్మెల్సీ కవిత నివాళి..
ప్రొఫెసర్ తాటికొండ వెంకట రాజయ్య అకాల మరణం పట్ల తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. వెంకటరాజయ్యను కోల్పోవడం తెలంగాణ బీసీ సమాజానికి తీరని లోటని అన్నారు. తెలుగు, ఇంగ్లిష్, యోగా తదితర రంగాల్లో వారి సేవలు చారిత్రాత్మకమని కొనియాడారు. రాజకీయాల్లో బీసీలు రాణించాలని పరితపిస్తూ.. స్ఫూర్తి ప్రదాతగా నిలవాలని ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.






