- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు తపాలా శాఖ సువర్ణావకాశం.. ఫ్రాంచైజీల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
భారత తపాలా శాఖ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పోస్టల్ ఫ్రాంచైజీల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తపాలా సేవలను ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భారత తపాలా శాఖ (Department of Posts) కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో కొత్తగా పోస్టల్ ఫ్రాంచైజీ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సికింద్రాబాద్, వికారాబాద్ ప్రాంతాల్లో నివసించే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే..?
కిరాణా దుకాణాలు, స్టేషనరీ షాపులు, పాన్ షాపులు, ఎలక్ట్రానిక్ వస్తువుల మార్కెట్లు నిర్వహించే వారు, చిరు వ్యాపారులు ఈ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వ్యక్తులు తమ సొంత సామర్థ్యంతో కూడా ఫ్రాంచైజీ కేంద్రాన్ని ప్రారంభించవచ్చు. దరఖాస్తు చేసే నాటికి అర్హులు 18 ఏళ్లు నిండి ఉండాలి. అదేవిధంగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక కేవలం డెలివరీ బాధ్యతలు తీసుకునే వారికి 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు తపాలా శాఖకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్లను ఆపరేట్ చేయగల సామర్థ్యం ఉండాలి. స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్ మాట్లాడటం, రాయడం తెలిసి ఉండాలి. డెలివరీ సేవల కోసం దరఖాస్తు చేసే వారు తప్పనిసరిగా టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు స్వంత వాహనం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడికి పాన్ కార్డ్ ఉండటం తప్పనిసరి.
కాగా, ఫ్రాంజైజీ ఏర్పాటు ఎంపికైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం నిర్ణీత సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాల కోసం తమ సమీపంలోని పోస్టాఫీసును లేదా సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్.. ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం






