- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విచారణకు కొన్ని గంటల ముందు.. కవిత చాటింగ్ బయటపెట్టిన ఈడీ!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రశ్నించబోతున్న ఈడీ అధికారులు అంతకు ముందు రోజు కీలక విషయాలను పేర్కొంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రశ్నించబోతున్న ఈడీ అధికారులు అంతకు ముందు రోజు కీలక విషయాలను పేర్కొంది. సిసోడియా రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు కోర్టు ముందు ఉంచింది. ఈ కేసులో వాట్సాప్ చాట్‌ను డీ కోడ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. ఇతరులకు అర్థం కాకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక కోడ్‌తో వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారని వీ- పేరుతో విజయ్ నాయర్, మేడం పేరుతో కవిత, సమీ పేరుతో సమీర్‌ను ఉద్దేశించి చాటింగ్ జరిగినట్లు ఈడీ తెలిపింది. వీ- నీడ్ మనీ అంటే విజయ్ నాయర్‌కు డబ్బు కావాలని కోడ్‌గా పెట్టుకున్నారని, కవితకు 33 శాతం వాటా ఇస్తామని చాటింగ్‌లో మాట్లాడుకున్నట్లు ఈడీ పేర్కొంది.
Read more:
Next Story






