- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Farmers: రైతన్నలకు పండుగలాంటి ముచ్చట.. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన
రైతన్నకు పండుగలాంటి ముచ్చట.. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రైతాంగానికి రేవంత్ సర్కార్ పండుగ లాంటి వార్త. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన ధాన్యం కొనుగోళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, ఈ నెలాఖరున వరి కోతలు ప్రారంభమవుతోన్న వేళ అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సర్కార్ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అదేవిధంగా ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు ప్రక్రియ సుమారు మూడ నెలల పాటు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇక సన్న వడ్లను పండించిన రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూరియా సమస్యను పూర్తిగా నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
Next Story






