హైదరాబాద్‌లో దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు

by Bhoopathi Nagaiah |

ప్రఖ్యాత ఫొటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.

హైదరాబాద్‌లో దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు
X

దిశ ,తెలంగాణ బ్యూరో : ప్రఖ్యాత ఫొటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కె.తారక రామారావు భరత్ భూషణ్ కుటుంబానికి హైదరాబాద్, జియాగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించారు. గతంలో, భరత్ భూషణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి ఆరోగ్య నిధి నుండి ప్రభుత్వం చేయూతనందించింది. కాగా... తమను కష్టకాలంలో ఆదుకుంటూ, ఇప్పుడు తమకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి మరోసారి అండగా నిలిచినందుకు భరత్ భూషణ్ భార్య సుభద్రమ్మ, కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Next Story