- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరేళ్ల బాలుడిపై కుక్క దాడి..
by Taduka Kalyani |
ఆరేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసిన సంఘటన గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, కరీమాబాద్: ఆరేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసిన సంఘటన గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే వరంగల్ మున్సిపాలిటీ 22వ డివిజన్ ఫస్ట్ బ్యాంక్ కాలనీలో శుక్రవారం జస్వంత్(6) పై కుక్క దాడికి పాల్పడుతున్న క్రమంలో అక్కడే ఉన్న పలువురు కేకలు వేసి కుక్కను తరిమేశారు. కాగా ఈ దాడిలో జస్వంత్ కుడి చేయి భాగానికి, నడుముకి కుక్క కాటు వేయడంతో తీవ్ర గాయాలైనాయి.
బాలుడిని హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. వరంగల్ మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కల బెడద నుంచి విముక్తికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Next Story






