- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లీషులో మాట్లాడే వారు సిగ్గుపడే రోజులొస్తాయి.. అమిత్ షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భాషలపై వివాదాలు ఉత్పన్నమవుతోన్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భాషలపై వివాదాలు ఉత్పన్నమవుతోన్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నేడు ఇంగ్లీషు (English)లో మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడే రోజులు వస్తాయని కామెంట్ చేశారు. స్థానిక భాషలకు కేంద్ర బిందువు భారతదేశమని, విదేశీ భాషల కంటే వాటికే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ భాషలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ఆభరణాలను అని తాను విశ్వసిస్తానని తెలిపారు. మాతృభాషను మాట్లాడని వారు ఎప్పటికీ పరిపూర్ణమైన భారతీయులు కాలేరని వ్యాఖ్యనించారు. దేశ వ్యాప్తంగా భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు అందురూ కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని సూచించారు. మన దేశం, మన సంస్కృతి, మన చరిత్ర, మన ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి ఏ విదేశీ భాష సరితూగదని అమిత్ షా (Amit Shah) అన్నారు.






