- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Missing: పెద్దలను ఒప్పించి కుదుర్చుకున్న పెళ్లి.. ఒకరోజు ముందు వరుడు మిస్సింగ్
సికింద్రాబాద్(Secunderabad) మారేడ్‌పల్లిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పెళ్లికి ఒకరోజు ముందు వరుడు అదృశ్యమయ్యాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్(Secunderabad) మారేడ్‌పల్లిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పెళ్లికి ఒకరోజు ముందు వరుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కొంతకాలంగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి యువజంట పెళ్లికి సిద్ధమైంది. చివరకు రేపు(శుక్రవారం) ముహూర్తం ఉండగా వరుడు సందీప్ రమేశ్(Sandeep Ramesh) ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మోసపోయామని భావించిన వధువు బంధువులు మారేడుపల్లి పోలీసులను ఆశ్రయించారు. పెళ్లికి వరకట్నంగా ఇచ్చిన రూ.10 లక్షలు తీసుకొని వరుడు పరారయ్యాడని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






