- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్‌ను ఢీకొన్న కంటైనర్.. భార్యాభర్తలు మృతి
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, ఇల్లందు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇల్లందు మండలం కరెంట్ ఆఫీస్ గౌతమ బుద్ధ ఐ టి ఐ వద్ద ఇల్లందు వైపునకు ద్విచక్ర వాహనంపై వస్తున్న లలితపురం గ్రామానికి చెందిన నడికొండ సుబ్బారావు, లలితమ్మను కొత్తగూడెం నుండి వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందారు. భార్య లలితమ్మ పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Next Story






