- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువుల పరిరక్షణకు సమగ్రమైన పాలసీ అవసరం : ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్
రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణకు వెంటనే నీటి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ పేర్కొంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణకు వెంటనే నీటి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ పేర్కొంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా నీటి సంఘాలు ఉన్న అంశాన్ని గుర్తుచేసింది. శనివారం సచివాయలంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ భేటీ అయ్యింది. ఈ భేటీలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటి వరకు రైతు కమిషన్ చేసిన కార్యక్రమాలను వివరించడంతో పాటు రాష్ట్రంలో చెరువులు, కుంటల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై మంత్రికి కమిషన్ సూచనలు చేసింది. గ్రామీణ స్థాయిలో రైతులు సంఘటితమై చెరువులను కాపాడుకునే వారని, ఐతే గత పదేండ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న చెరువులు కుంటలు అన్యాక్రాంతమయ్యాయని వివరించింది.
కొన్ని చోట్ల కబ్జాదారులు ఆక్రమించి లే ఔట్లు వేయడం, వాటర్ బాడీస్ కు వచ్చే క్యాచ్ మెంట్ ఏరియాల్లో భారీగా కాల్వలు దెబ్బతినడం, మాయమవడం జరిగాయని వివరించింది. ప్రధానంగా చెరువులు కుచించుకపోవడం, గ్రౌండ్ వాటర్ లెవల్స్ పడిపోవడం జరిగిందని వివరించింది. రాష్ట్రంలో చెరువులు కాపాడుకుపడానికి సమగ్రమైన పాలసీ ఉండాలని రైతు కమిషన్ తెలిపింది. ఆ పాలసీని కమిషన్ తయారు చేయనున్నట్లు వివరించింది. నిపుణులతో పాలసీ కి సంబంధించి ప్రసెంటేషన్ మీటింగ్ త్వరలో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు, ఆ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకావాలని కమిషన్ కోరింది. కమిషన్ ఆహ్వానం కు మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించినట్లు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.






