- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మవారి ఆలయంలో అద్భుతం.. శివరాత్రి రోజు నాగుపాము పత్యక్షం
నిర్మల్ జిల్లా గొడిసెర్యాల గ్రామం రాజా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగిన మహా శివరాత్రి వేడుకల్లో నాగు పాము ప్రత్యక్షమైంది..

దిశ, వెబ్ డెస్క్: యాధృశ్చికమో.. అద్భుమో తెలియదు గాని ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. అది కూడా మహాశివరాత్రి రోజు జరగడంతో విశేషంగా మారింది. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసెర్యాల గ్రామంలో రాజా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి పూజలో పాల్గొన్నారు. పాత మొక్కులు తీర్చుకుని కొత్తవి కోరుకున్నారు. అయితే శివపార్వతుల కల్యాణం జరుగుతున్న సమయంలో మాత్రం ఓ అద్భుతం జరిగింది. ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో నాగుపాము ప్రత్యక్షమైంది. అంతేకాదు పడగ విప్పి భక్తులను అలానే చూస్తూ బుసలు కొట్టింది. దీంతో భక్తులు దేవతా సర్పం అంటూ స్వయంగా శివపార్వతుల కల్యాణం చూసేందుక వచ్చిందంటూ భక్తి భావనలతో పొగిపోయారు. కొంతసమయం తర్వాత పాము స్థానకంగా ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లింది. పాము వీడియోను భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నాగుపాము ప్రత్యక్షం... వీడియో వైరల్






