BJP : ముఖ్యమంత్రిపై చీటింగ్ కేసు నమోదు చేయాలి : బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJPLP Leader Eleti Maheshwar Reddy) డిమాండ్ చేశారు.

BJP : ముఖ్యమంత్రిపై చీటింగ్ కేసు నమోదు చేయాలి : బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJPLP Leader Eleti Maheshwar Reddy) డిమాండ్ చేశారు. నేడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి మహేశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆరు గ్యారంటీలు(Six Guarantees) ఇచ్చి నేటికీ ఏడాది పూర్తయిందని.. ఇంతవరకు వాటిని అమలు చేయలేదని, ఇంకెంత కాలం ప్రజలను మభ్య పెడతారని ఆయన మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు నెరవేర్చేందుకు బడ్జెట్ లేదని ఇప్పుడు చెబుతున్నారని, అన్ని విషయాలు తెలిసినా తప్పుడు వాగ్ధానాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలియయజేశారు. ఏడాదైనా ఆరు గ్యారంటీలు నమోదు చేయని సీఎం, డిప్యూటీ సీఎం మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ హామీలపై వాయిదా తీర్మానం ఇస్తే స్పీకర్ తిరస్కరించారని, విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story