- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లాపై కేసు.. ఎందుకో తెలుసా?
by Ramesh Naini |
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల నిబంధన ఉలంఘించారని తాజాగా జనగామ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల నిబంధన ఉలంఘించారని తాజాగా జనగామ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల రోజు ఆయన మెడలో గులాబీ కలర్ కండువా కప్పుకొని పోలింగ్ బూత్‌కి వెళ్లారు. అయితే, దీనిపై జనగామ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ పాటు పోలీసులకు కాంగ్రెస్ లీడర్ పోలింగ్ ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
కండువాతో పోలింగ్ బూత్ కి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బలవంతంగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు వ్యక్తి ఫోటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్‌పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం ఆదివారం బయటకు వచ్చింది.
Next Story






