దేవుడి సాక్షిగా ఓటర్లతో ప్రమాణం చేయించిన BRS లీడర్.. నాగర్ కర్నూల్ జోరుగా ప్రలోభాలు..!

by Satheesh |

నాగర్‌కర్నూల్‌లో అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపారు. నియోజకవర్గ పరిధిలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్‌ గ్రామంలో ఓ బీఆర్ఎస్ నాయకుడు

దేవుడి సాక్షిగా ఓటర్లతో ప్రమాణం చేయించిన BRS లీడర్.. నాగర్ కర్నూల్ జోరుగా ప్రలోభాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూల్‌లో అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపారు. నియోజకవర్గ పరిధిలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్‌ గ్రామంలో ఓ బీఆర్ఎస్ నాయకుడు బహిరంగంగా ఓటర్లను ప్రలోభపెట్టాడు. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేస్తే మీ కమ్యూనిటీ హాల్‌కు స్లాబ్‌ వేయిస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. ఈ మేరకు బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని చెన్నకేశవ స్వామి సాక్షిగా ఓటర్లతో ఆయన ప్రమాణం చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడుతున్నారు. ఓ వైపు డబ్బు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతూనే.. మరో పక్కా ఓట్ల కోసం హామీలు ఇస్తూ ఓటర్లతో ప్రమాణం చేయించడంపై భగ్గముంటున్నారు.

కాగా, బీఆర్ఎస్ నాయకుడు ఓటర్లను బహిరంగంగా ప్రలోభ పెడుతూ.. బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. కాగా, దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓట్ల కోసం ఓటర్లతో ప్రమాణం చేయించడం ఏంటని నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ప్రలోభాల పర్వం మొదలైంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతలు పెద్ద ఎత్తున మద్యం, మనీ పంచుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఓటుకు భారీ మొత్తం చెల్లిస్తున్నారు.

Next Story