అంబులెన్స్‌లో వెళ్లి నామినేషన్ వేసిన BRS అభ్యర్థి

by Disha Web Desk 4 |
అంబులెన్స్‌లో వెళ్లి నామినేషన్ వేసిన BRS అభ్యర్థి
X

దిశ, దుబ్బాక : రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో కేంద్ర బలగాలు, పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటీవల దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో దుండగుడి చేతిలో కత్తిపోటుకు గురై హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

కాగా దుబ్బాక‌లో నామినేషన్ దాఖలు చేయడానికి యశోద ఆసుపత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో వైద్య సిబ్బంది సహకారంతో విచ్చేసిన మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో కలిసి గురువారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, సోలిపేట సతీష్ రెడ్డి, జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, 14 వ వార్డు కౌన్సిలర్ అస యాదగిరి, నాయకులు రామవరం చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.



Next Story

Most Viewed