- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండ నుంచి అయోధ్యకు ఫ్రీ రైలు.. 1400 మందిని ఫ్రీగా తీసుకెళ్లనున్న బీజేపీ నేత
దేశం మొత్తం ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది. 22న రాములోరి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కూడా జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశం మొత్తం ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది. 22న రాములోరి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కూడా జరగనుంది. ఈ క్రమంలో హిందువుల ఏళ్ల నాటి కళ సాకారం అవుతుండటంతో శ్రీరామ భక్తులు అయోధ్య వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొందరైతే ఇప్పటికే కాలినడకన అయోధ్యకు పయనమయ్యారు. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. నల్లగొండ బీజేపీ ఇన్‌చార్జ్‌గా నియమితులైన నాగం వర్షిత్ రెడ్డి.. ఏకంగా నల్గొండ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును బుక్ చేశారు.
ఈ రైలులో దాదాపు 1400 మందిని అయోధ్యకు తీసుకెళ్లనున్నారు. ఇందులో బీజేపీ పార్టీ కార్యకర్తలతో పాటు సామన్యులకు అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ రైలు ఫిబ్రవరి 4న నల్లగొండ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవ్వనున్నట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రధాని మోడీ నల్లగొండలో జరిగే సభకు రానున్నారు. ఈ క్రమంలో అయోధ్యకు ఫ్రీ రైలును బుక్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేయగా.. రానున్న కాలంలో అన్ని పార్టీలో ఇలానే చేయాలని నేతలు డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు.






