- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిర్యాలగూడలో గంజాయి బ్యాచ్ హల్‌చల్
by Ajay Maddhiboyina |
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మూకలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. తరచూ ఎక్కడో ఒకచోట గంజాయి మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మూకలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. తరచూ ఎక్కడో ఒకచోట గంజాయి మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. మిర్యాలగూడలోని బంగారుగడ్డ ప్రాంతంలో ఉన్న పప్పు మిల్లు వద్ద ఒక యువకుడిని 10 మందితో కూడిన గంజాయి బ్యాచ్ కలిసి విచక్షణారహితంగా దాడి చేసింది. అతడు తనను కొట్టవద్దని వేడుకున్నా, ఎంత బతిమాలినా కూడా వినకుండా పిడిగుద్దులు విసురుతూ, కాళ్లతో తన్నుతూ హల్ చల్ సృష్టించారు. యువకుడికి తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story






