ఎక్సైజ్ శాఖకు గ్రూపు 2 ద్వారా 97 మంది ఎస్సైలు

by Naga Rani Yarlagadda |

గ్రూప్ 2 నియామకాల ద్వారా ఎంపికైన వారిలో 97 మంది ఎక్సైజ్ శాఖకు కేటాయింపు జరిగినట్లు వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తియినట్లు..

ఎక్సైజ్ శాఖకు గ్రూపు 2 ద్వారా 97 మంది ఎస్సైలు
X
  • అబ్కారీ భవన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి
  • మల్టీజోన్ 1కు 63 మంది, మల్టీజోన్ 2 కు 34 మంది కేటాయింపు

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ 2 నియామకాల ద్వారా ఎంపికైన వారిలో 97 మంది ఎక్సైజ్ శాఖకు కేటాయింపు జరిగినట్లు వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తియినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. అబ్కారి భవన్ లో సోమవారం అభ్యర్థుల సర్టిఫికెట్లను ఎక్సైజ్ శాఖ అధికారులు పరిశీలించారు. వారిలో మల్టీజోన్ 2కు 34 మందిని ఎంపిక చేయగా సరిఫికెట్ల వేరిఫికేషన్‌ కోసం 33 మంది హాజరయ్యారని హైదరాబాద్‌ డిప్యూటి కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. మల్టీ జోన్ 1 63 మందిని కేటాయించగా సరిఫికెట్ల వేరిఫికేషన్‌కు అందరూ హాజరయ్యారని వరంగల్‌ డిప్యూటి కమిషనర్‌ జి. అంజన్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో సర్టిఫికెట్ల వేరిఫికేషన్‌లో ఏఈఎస్‌లు స్మిత సౌజన్య, మోహన్‌బాబు, శ్రీనివాసరావుల పర్యవేక్షణలో సర్టిఫికేట్ల వేరిఫికేషన్‌ జరిగినట్లు వెల్లడించారు. గ్రూపు 1 వన్ నియామకాల ద్వారా వచ్చిన 30మంది అభ్యర్ధులతో, పాటు గ్రూప్ 2 ద్వారా నియామకమైన 97 మందికి ఒకేసారి ఎక్సైజ్ ట్రైనింగ్ సెంటర్లో మూడు నెలల పాటు శిక్షణ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

Next Story