TG Liquor Shops Applications: అత్యధికంగా రంగారెడ్డిలో.. అత్యల్పంగా ఆ జిల్లాలోనే!

by Gantepaka Srikanth |

తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు చివరి రోజు 23 గురువారం రాత్రి వరకు 4822 దరఖాస్తులు వచ్చాయి.

TG Liquor Shops Applications: అత్యధికంగా రంగారెడ్డిలో.. అత్యల్పంగా ఆ జిల్లాలోనే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు చివరి రోజు 23 గురువారం రాత్రి వరకు 4822 దరఖాస్తులు వచ్చాయి. ఓబీసీ బంద్‌, పబ్లిక్‌ ట్రాన్స్‌ఫోర్టు బస్సులు నడువకపోవడం, కొన్నిచోట్ల బ్యాంకులు పనిచేయకపోవడం వంటి పరిస్థితులను దృష్టి ఉంచుకొని ఎక్సైజ్‌ శాఖ మద్యం షాపులకు దరఖాస్తుల గడవును ఈనెల 23 వరకు పొడగించిన విషయం తెలిసిందే. అత్యధికంగా రంగారెడ్డి డివిజన్‌లో 29,420 రాగా, అతి తక్కువగా 4154 ఆదిలాబాద్‌‌ డివిజన్‌లో వచ్చాయి.

27న మద్యం షాపులకు డ్రా..

తెలంగాణలో 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులను దాఖలు చేశారు. ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ల, జిల్లా వారిగా మద్యం షాపుల దరఖాస్తుదారుల సమక్షంలో ఈనెల 27న ఉదయం 11 గంటలకు డ్రా తీయనున్నారు.

ఎక్సైజ్‌ జల్లాల వారీగా..

ఆదిలాబాద్‌లో 771, కొమురం భీమ్‌ అసిఫాబాద్‌లో 680, మంచిర్యాలలో 1712, నిర్మల్‌లో 991, హైదరాబాద్‌లో 3201, సికింద్రాబాద్‌లో 3022, జగిత్యాలలో 1966, కరీంనగర్‌లో 2730, పెద్దపల్లిలో 1507, రాజన్న సిరిసిల్లలో 1381, ఖమ్మంలో 4430, కొత్తగూడెంలో 3922, జోగులాంబ గద్వాలలో 774, మహబూబ్‌నగర్‌లో 2487, నాగర్‌కర్నూల్‌లో 1518, వనపర్తిలో 757, మెదక్‌లో 1420, సంగారెడ్డిలో 4432, సిద్దిపేటలో 2782, నల్లగొండలో 4906, సూర్యపేటలో 2771, యాదాద్రి భువనగిరిలో 2776, కామారెడ్డిలో 1502, నిజామాబాద్‌లో 2786, మల్కాజిగిరిలో 5168, మేడ్చల్‌‌లో 6063, సరూర్‌నగర్‌లో 7845, శంషాబాద్‌లో 8536, వికారాబాద్‌లో 1808, జనగామాలో 1697, జయంశంకర్‌ భూపాల్‌పల్లిలో 1863, మహబూబబాద్‌లో 1800, వరంగల్‌ రూరల్‌లో 1958 వరంగల్‌ అర్బన్‌లో 3175 మొత్తంగా 95,137 దరఖాస్తులు వచ్చాయి.

Next Story