- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోస్త్ మూడో విడతలో 93,516 సీట్లు కేటాయింపు
రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి, కాలేజీ విద్య కమిషనర్ దేవసేన ఒక ప్రకటనలో సంయుక్తంగా వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి, కాలేజీ విద్య కమిషనర్ దేవసేన ఒక ప్రకటనలో సంయుక్తంగా వెల్లడించారు. మూడో దశలో మొత్తం 93,516 మంది అభ్యర్థులకు సీట్లు లభించాయి. ఇందులో బెటర్ చాయిస్ కోసం వెళ్లిన 14,019 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ద్వారా 65,466 మందికి, రెండవ లేదా ఇతర ప్రాధాన్యతల ద్వారా 28,050 మందికి సీట్ల కేటాయింపు జరిగింది. మూడో విడతలో మొత్తం రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లలో మొత్తం 90,652 మంది విద్యార్థులు కొత్తగా నమోదు చేసుకోగా, ఫేజ్-1, 2 విద్యార్థులతో కలిపి మొత్తం 1,07,284 మంది వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. చాలా తక్కువ వెబ్ ఆప్షన్లు ఇవ్వడం వల్ల 13,768 మంది విద్యార్థులకు ఈ విడతలో సీట్లు కేటాయించలేదు.
సీటు పొందిన విద్యార్థులందరూ జూన్ 26 నుండి జూలై 2 వరకు ఆన్‌లైన్ లో సెల్ఫ్-రిపోర్టింగ్ చేసి తమ సీటును రిజర్వ్ చేసుకోవాలి. ఒకవేళ విద్యార్థి ఫేజ్-2 లో వచ్చిన సీటు కంటే ఫేజ్-3 లో కొత్త సీటు పొందితే పాత సీటు రద్దవుతుంది, కొత్త సీటుకు మళ్లీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్స్ కు అర్హత ఉండి, ప్రభుత్వ లేదా యూనివర్సిటీ కాలేజీల్లో సీటు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మూడు విడతల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులందరి మొబైల్ నంబర్లకు ఓటీపీ అందుతుంది. విద్యార్థులు జూన్ 27 నుండి జూలై 4 లోపు తమకు కేటాయించిన సంబంధిత కళాశాలలకు స్వయంగా హాజరై, ప్రవేశాన్ని ధ్రువీకరించుకోవాలి. నిర్దేశిత సమయంలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ లేదా కాలేజీ రిపోర్టింగ్ చేయని వారు తమ సీటును కోల్పోతారని అధికారులు హెచ్చరించారు.
వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థులు:
మూడో విడతలో ఫ్యాకల్టీల వారీగా కేటాయింపులు చూస్తే కామర్స్ వైపే విద్యార్థులు మొగ్గు చూపారు. కామర్స్ లో 37,510 , ఫిజికల్ సైన్సెస్ లో 21,942, అర్ట్స్ లో 17,245, లైఫ్ సైన్సెస్ 16,751, ఇతరులు 68 మంది విద్యార్థులు సీట్లు పొందారు






