- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామీణుల్లో 90% ఓటింగ్… పట్టణాల్లో తగ్గుతున్న ఓటు వినియోగం
ఆదివారం మక్తల్ పట్టణంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మినీ స్టేడియం నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

దిశ, మక్తల్ : పల్లెటూర్లలో సామాన్య ప్రజలు సైతం 90 శాతం వరకు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, అయితే పట్టణాల్లో నివసిస్తున్న చదువుకున్న వర్గం ఓటు హక్కును వినియోగించుకోవడంలో అనాసక్తి చూపడం సరైన పద్ధతి కాదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మినీ స్టేడియం నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రారంభించారు. ఓటు విలువపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు, యువత “మన ఓటు – మన హక్కు” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్‌లో 70 నుంచి 90 శాతం వరకు పల్లెటూర్లలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. అదే ఉత్సాహాన్ని పట్టణాల్లో నివసిస్తున్న విద్యావంతులు చూపడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన ముఖ్యమైన హక్కుల్లో ఓటు హక్కు ఒకటని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే శక్తి ఓటర్ల చేతుల్లోనే ఉందని మంత్రి గుర్తు చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి లక్ష్మారెడ్డి, కోళ వెంకటేష్, కట్టా సురేష్, రవికుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
READ MORE ....






