- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్‌డేట్
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయని అన్నారు. మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నాం.. ఈ పథకం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నది. ఇందులో భాగంగానే బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామనే సంకేతాలను ఇచ్చేలా కార్యక్రమాలను చేపట్టేందుకు పార్టీ సిద్ధమవుతోంది. వచ్చేనెల మొదటివారంలో హైదరాబాద్‌లో జాతీయస్థాయి ఓబీసీ మహాసభ నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. సభకు అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. వారితో బీసీ రిజర్వేషన్లపై పార్టీ పరంగా మరోసారి ప్రజలకు స్పష్టత ఇప్పించే యోచనలో ఉన్నట్లుగా పార్టీ నేతలు చెప్తున్నారు. అలాగే ఇదే వేదికగా బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందనే విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాలని నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరుగనున్నందున పార్టీ పరంగా బీసీలకు 42శాతం సీట్లు కేటాయించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరేవిధంగా వ్యూహరచన చేయాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు.
READ MORE ....






