- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం షాపుల పోటీ రికార్డు.. 2620 షాపులకు 89,344 దరఖాస్తులు.. గడువు పెంచిన ఎక్సైజ్ శాఖ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం షాపులకు 89,344 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదివారం అధికారికంగా వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం (liquor shops) షాపులకు 89,344 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదివారం అధికారికంగా వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ శాఖ వెల్లడించింది. మద్యం షాపులకు నిర్వహణకు సంబంధించి శనివారం వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. దరఖాస్తుల స్వీకరణ ఆఖరు రోజు ఓబిసి జేఏసీ బీసీ రిజర్వేషన్ల కోసం బంద్ పిలుపునివ్వడంతో గడువు పెంపుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా ఆఖరి రోజు 50 వేల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
27వ తేదీన లాటరీ పద్ధతిలో నిర్వాహకుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలోని 615 మద్యం షాపులకు 31,534 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. హైదరాబాద్ డివిజన్ పరిధిలో 80 షాపులు 2,960 దరఖాస్తులు, సికింద్రాబాద్ డివిజన్ 99 షాపులకు 2,787 దరఖాస్తులు, మల్కాజ్‌గిరి డివిజన్ 88 షాపులకు 4,879 దరఖాస్తులు, మేడ్చల్ డివిజన్ 114 షాపులకు 5,203 దరఖాస్తులు, సరూర్ నగర్ డివిజన్ 134 షాపులకు 7,595 దరఖాస్తులు శంషాబాద్ డివిజన్ 100 షాపులకు దరఖాస్తులు 8,110 వచ్చాయి. ఖమ్మం డివిజన్ 122 షాపులకు 4,094 దరఖాస్తులు, నల్గొండ డివిజన్ 155 షాపులకు 4,620 దరఖాస్తులు, సంగారెడ్డి డివిజన్ 101 షాపులకు 4,190 దరఖాస్తులు పడ్డాయి.






