- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవీంద్రభారతిలో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు 88వ జయంతి ఉత్సవాలు
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు 88వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు , రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు , సీపీఐ ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు తదితరులు హాజరై శ్రీపాద రావును ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీపాద రావు మన నుంచి దూరమై 25 సంవత్సరాలు గడిచినా ఇప్పటికి ప్రజల మనసులలో నిలిచిపోయారంటే వారి మంచితనం, నడవడిక, ప్రజలకు చేసిన సేవలు ఎంత గొప్పవో అర్ధం చేసుకోచ్చన్నారు. గ్రామ పంచాయితీ సర్పంచ్ గా ప్రజా జీవితం ప్రారంభించి రాష్ట్రంలో అత్యున్నత శాసనసభాధిపతి పదవి పొందడం, వారి నిస్వార్ధ ప్రజా సేవకు లభించిన గౌరవం అన్నారు.
అసెంబ్లీ స్పీకర్ పదవి అంటేనే కత్తి మీద సాము లాంటిదని, అన్ని పక్షాలు సంతృప్తి చెందే విదంగా సభను నడపాల్సిన బాధ్యత సభాపతి మీద ఉంటుందన్నారు. ఈ క్రమంలో దుద్దిళ్ల శ్రీపాద రావు శాసనసభను నిర్వహించిన తీరు మాకు ఆదర్శం అని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మనిషిలో హుందాతనం, రాజకీయాలలో పెద్దరికం ఎలా ఉండాలో శ్రీపాద రావు ని చూసి నేర్చుకోవాలన్నారు. చిరు నవ్వుతో శాంతంగా సమస్యలను విని పరిష్కారానికి కృషి చేసిన శ్రీపాద రావు ప్రజా సమస్యల పరిష్కారానికి నేటి ప్రజా ప్రతినిధులు అనుసరించాల్సిన విదానానికి ఉదాహరణ అని సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ మాజీ సభాపతి శ్రీ పాద రావు జీవితం ఆదర్శనీయం అన్నారు. అంబేద్కర్, బుద్ధిస్ట్ విధానాలను ముందుకు తీసుకు వెళ్ళేవారని తద్వారా అసెంబ్లీ నీ హుందాగా నడిపే వారన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మాజీ స్పీకర్శ్రీ పాద రావు ఇప్పటి తరానికి ఆదర్శం అన్నారు. సర్పంచ్ నుండి వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయ్యి అసెంబ్లీ సభాపతి గా అయ్యారన్నారు. ఒక్కసారి గెలిస్తేనే మల్లోక సారి గెలవడం కష్టం అయిన ఈ రోజుల్లో 8 సార్లు ఆ కుటుంబం నుండి ఎమ్మెల్యే గా నియోజక వర్గ ప్రజలు గెలిపించారని, ఆ కుటుంభం పై ప్రజలకు ఉన్న నమ్మకం అలాంటిదన్నారు. ఆయన ను ఆదర్శంగా తీసుకుని మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారా శాఖ మంత్రి గా హుందాగా నడుపుతున్నారన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే వారికి శ్రీ పాద రావు జీవితం ఒక పాఠం లాంటిదన్నారు. శ్రీ పాద రావు అప్పచెప్పిన ఆ నియోజక వర్గం కోసం కుమారుడు మంత్రి శ్రీదర్ బాబు పరితపిస్తుంటూ ఉంటారన్నారు. ఒక్కటే నియోజక వర్గం లో ఎన్నో సార్లు గెలవడం అంటే అసాధ్యం అని అలాంటి ఆసాధ్యంను శ్రీదర్ బాబు సుసాధ్యం చేశాడన్నారు. సీపీఐ ఎంఎల్ఏ కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కి ఉన్నట్లు శ్రీదర్ బాబు కి మన్నించే గుణం ఉందన్నారు. శ్రీ పాద రావు ఆలోచనల్ని ముందుకు తీసుకు వెళ్ళండని ఈ సందర్భంగా మంత్రి శ్రీదర్ బాబు కు సూచిస్తున్నామన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పనిచేసి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు శ్రీ దుద్దిళ్ల శ్రీపాద రావు అన్నారు. 26 ఏళ్ల కిందట నాన్న ని కోల్పోయామని, కానీ... ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నారన్నారు. తన పనితీరుతో పార్టీలకు అతీతంగా అభిమానులను ఆయన సంపాదించుకున్నారని, అందర్నీ కలుపుకొని వెళ్ళారన్నారు. ప్రజల కోసమే చివరి క్షణం వరకు తపించారని, అదే స్ఫూర్తితో ఆయన చూపిన అడుగు జాడల్లోనే మా కుటుంబ సభ్యులం నడుస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నాన్న భౌతికంగా మా నుంచి దూరమైనా.. ఆయన ఆశయాలు, ఆలోచనలు మాతోనే ఉన్నాయన్నారు. వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బృహత్తర బాధ్యత మాపై ఉందని, మేం ప్రజలకు చేయాల్సింది చాలా ఉందన్నారు. ప్రజలు మాపై చూపించే అభిమానం, ప్రేమకు సదా కృతజ్ఞులం అని ఆయన పేర్కొన్నారు. మా చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేస్తామని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేని లోటును పూడ్చలేనిదన్నారు. తనదైన పని తీరుతో రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్రను వేశారన్నారు. నాన్న జయంతిని ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు.






