- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ గా పదోన్నతులు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ పరిధిలో 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్‌గా పదోన్నతులు కల్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ పరిధిలో 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్‌గా పదోన్నతులు కల్పించారు. సోమవారం ఇంటర్మీడియట్ విద్యా మండలిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రిన్సిపాల్స్ గా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి పరీక్షల నియంత్రణాధికారి జయప్రదా బాయి, అలాగే మెదక్, రంగారెడ్డి జిల్లాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు (డీఐఈఓలు) హాజరయ్యారు. పదోన్నతి పొందిన లెక్చరర్లను డైరెక్టర్ అభినందించారు.
వారు తమ కొత్త బాధ్యతలను అత్యంత నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. విద్యా వాతావరణాన్ని పటిష్టం చేయడంలో, సంస్థాగత స్థాయిలో నాయకత్వం వహించడంలో ప్రిన్సిపల్స్ కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో విద్యారంగాన్ని మెరుగుపరచడంలో నాయకత్వ బాధ్యతలను సమర్థంగా నెరవేర్చాలని ఆకాంక్షించారు. ఈ పదోన్నతుల ప్రక్రియలో ప్రతిభకు, సేవలకు ప్రాధాన్యతనిస్తూ, పూర్తి పారదర్శకతను పాటించామని తెలిపారు.






