HYD: ఇక్కడ చికెన్ తింటే మటాషే..800 KGల కుళ్లిన చికెన్ స్వాధీనం

by Prasad Jukanti |   (  Updated:2026-03-17 10:23:51  IST  )

చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, అక్రమార్కులు కుళ్లిపోయిన మాంసంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

HYD: ఇక్కడ చికెన్ తింటే మటాషే..800 KGల కుళ్లిన చికెన్ స్వాధీనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి యుద్ధ పరిస్థితితులు, ఎండల కారణంగా చికెన్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు దూసుకుపోతుంటే మరో వైపు కొంత మంది వ్యాపారులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా కుల్లిపోయిన చికెన్ (Stale Chicken) స్టాక్‍ను గుర్తించారు. సికింద్రాబాద్ పరిధిలోని పార్శిగుట్టలో ఉన్న 1 ఫ్రెష్ చికెన్ షాప్ పై అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సుమారు 800 కేజీల నిల్వ ఉంచిన (కుళ్లిపోయిన) చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని బార్‌లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సదరు చికెన్ షాపు లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగించడమే కాకుండా కుళ్లిపోయిన చికెన్ విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్ల గుర్తించి వెంటనే ఈ షాప్ ను సీజ్ చేశారు. కాగా యుద్ధం వల్ల దిగుమతలు తగ్గడం, ఎండల వల్ల చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో డ్రెస్డ్ చికెన్ ధర కిలో రూ.300 చేరగా, ఇక స్కిన్‌లెస్ చికెన్ ధర 350 వరకు పెరిగింది. ఇక నాటు కోడి అయితే కిలోకు రూ.750 నుంచి రూ.800 మధ్య పలుకుతోంది. దీంతో జనం నాన్​వెజ్​వైపు చూడాలంటేనే జంకుతున్నారు.

Next Story