- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువుల కబ్జాదారుల్లో 80 శాతం బీఆర్ఎస్ నాయకులే.. పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
చెరువుల కబ్జాలలో బీఆర్ఎస్ నాయకులే ఉన్నారని, హైడ్రా వల్ల ఒకే ఒక్క పేదవాడి ఇళ్లు మాత్రమే తొలగించబడిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: చెరువుల కబ్జాలలో బీఆర్ఎస్ నాయకులే ఉన్నారని, హైడ్రా వల్ల ఒకే ఒక్క పేదవాడి ఇళ్లు మాత్రమే తొలగించబడిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. గురువారం ఏకగ్రీవం అయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో (Congress MLCs) గాంధీభవన్ (Gandhi Bhavan) లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రా (Hydra), మూసీ (Moosi) ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలు (Great Decissions) అని అన్నారు. హైద్రాబాద్ (Hyderabad) అంటే సీటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్ (City Of Rocks And Lakes) అని, నిజాం నవాబులు ఎన్నో చెరువులు నిర్మించారని తెలిపారు. ఈ చెరువులు అన్నీ కబ్జాకు గురి అయ్యాయని, వీటి కోసమే హైడ్రాను తీసుకొచ్చామని అన్నారు.
ఇక ఈ హైడ్రా ఎపిసోడ్ మొత్తంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక్క పేదవాడి ఇళ్లు మాత్రమే తొలగించబడిందని, అది కూడా చెరువులో ఉన్నదేనని స్పష్టం చేశారు. హైడ్రాకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) మాత్రమే గోల చేస్తున్నారని, ఎందుకంటే చెరువుల కబ్జాదారుల్లో 80 శాతం బీఆర్ఎస్ నాయకులే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కబ్జాల వల్ల చెరువుల ద్వారా భూమిలోకి వెళ్లాల్సిన వాన నీళ్లు ఇళ్లలోకి వచ్చి హైద్రాబాద్ మునిగిపోతుందని తెలిపారు. దాని కోసమే మూసీ ప్రక్షాళన చేశామని, మూసీ వెంట ఉన్నవారిలో 80 శాతం మంది పునరావాసం కల్పిస్తే వెళతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అన్నారు. మూసీ ప్రక్షాళన వల్ల హైద్రాబాద్ సురక్షిత ప్రాంతంగా మారి వీదేశీ పెట్టుబడులు కూడా వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేసి కట్టుకున్న నిర్మాణాలు పోతున్నాయని వాళ్లు మాత్రమే గగ్గోలు పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ (Congress MLC) విమర్శించారు.






