- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో 8 మంది ఐపీఎస్‌లు బదీలీ
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్/సిటీ క్రైం: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలె 8 మంది ఐఏఎస్‌లను (IAS) బదిలీ చేసిన సర్కార్.. తాజాగా మరో 8 మంది ఐపీఎస్‌లను (IPS) బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. అయితే, త్వరలో రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
* పి.విశ్వప్రసాద్: అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ సిటీ నుంచి హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
* డాక్టర్ బి.నవీన్ కుమార్: తెలంగాణ సీఐడీ, హైదరాబాద్‌కు ఎస్పీగా నియమితులయ్యారు.
* డాక్టర్ గజరావు భూపాల్: డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కోఆర్డినేషన్, తెలంగాణ, హైదరాబాద్ నుంచి సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
* డి.జోయెల్ డేవిస్: హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా నియమితులయ్యారు.
* సిరిశెట్టి సంకీర్థ్: గవర్నర్‌కు సహాయక అధికారిగా (ADC) తన హోదాను కొనసాగించనున్నారు.
* బి.రామ్ రెడ్డి: తెలంగాణ సీఐడీ, హైదరాబాద్‌కు ఎస్పీగా నియమితులయ్యారు.
* చి.శ్రీధర్: తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా నియమితులయ్యారు.
* ఎస్.చైతన్య కుమార్: హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా నియమితులయ్యారు.






