- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైళ్ల శాఖలో ఏఐ నిఘా వ్యవస్థ.. హైదరాబాద్‌లో ప్రారంభమైన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్
జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆధ్వర్యంలో (Prison Duty Meet-2025) 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటి మీట్ –2025ను ఆర్‌బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమిలో మంగళవారం అట్టహసంగా ప్రారంభించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జైలు సిబ్బంది ప్రజల దృష్టికి దూరంగా పనిచేస్తున్నప్పటికీ, అంతర్గత భద్రతను కాపాడటంలో, సంస్కరణలను సాధ్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. జైళ్లశాఖ తరపున టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసినందుకు, డ్యూటీ మీట్‌ను అధికారికంగా ప్రారంభించినందుకు తెలంగాణ జైళ్ల శాఖను ఆయన అభినందించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా (Soumya Mishra) ఆధ్వర్యంలో (Prison Duty Meet-2025) 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటి మీట్ –2025ను ఆర్‌బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమిలో మంగళవారం అట్టహసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హజరయ్యారు. సీఎస్ రామకృష్ణ రావు, అడిషినల్ డైరక్టర్ బీపీఆర్‌డీ రవి జోసెఫ్, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా డీజీపీ జితేందర్ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. జైళ్ల శాఖ డ్యూటీ మీట్‌ల చరిత్రలో తొలిసారిగా ఏఐ-ఆధారిత నిఘా వ్యవస్థలు, డ్రోన్‌లు, స్కానర్లు, నిషిద్ధ వస్తువులను గుర్తించే సాంకేతికతలు, రోబోటిక్స్ అధునాతన సమాచార నిర్వహణ సాఫ్ట్‌వేర్ ప్రవేశ పెట్టడం పట్ల జైళ్ల శాఖ పనితీరు మెరుగుపడుతుందని తెలిపారు. ఖైదీల సృజనాత్మకత, క్రమశిక్షణ , నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే వివిధ రాష్ట్రాల నుంచి జైలులో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. డ్యూటీ మిట్‌లో 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 1,222మంది జైళ్ల శాఖ ఔత్సహికులు, 144 సపోర్టింగ్ స్టాఫ్ పాల్గొంటున్నారని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, ఆర్‌బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమి డైరక్టర్ అభిలాష బిష్త్, ఇంటిలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి హాజరయ్యారు.






