రైతు కోసం 75 రోజుల చర్చలు.. లీఫ్స్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్

by Gantepaka Srikanth |

రైతులు, వ్యవసాయ రంగాల్లో సంక్షేమం కోసం లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో 75 రోజుల పాటు వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు లీఫ్స్ అండ్ గ్రామీణ న్యాయ పీఠం అడ్వయిజర్, ఫార్మర్స్ వాలంటీర్స్ స్టేట్ కో ఆర్డినేటర్ కరుణాకర్ దేశాయి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రైతు కోసం 75 రోజుల చర్చలు.. లీఫ్స్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు, వ్యవసాయ రంగాల్లో సంక్షేమం కోసం లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో 75 రోజుల పాటు వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు లీఫ్స్ అండ్ గ్రామీణ న్యాయ పీఠం అడ్వయిజర్, ఫార్మర్స్ వాలంటీర్స్ స్టేట్ కో ఆర్డినేటర్ కరుణాకర్ దేశాయి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) నుంచి నిరాటకంగా ఈ రంగాల్లో నెలకొన్న సమస్యలు, పరిష్కార మార్గాలు, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు, కొత్తగా అమల్లోకి తీసుకురావాల్సిన చట్టాలపై నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు చెప్పారు.

అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో "భూ భారతి చట్టం, ఇతర భూ చట్టాలు" పై రైతులతో ముఖాముఖీ అవగాహన సదస్సులు కూడా నిర్వహించనున్నామన్నారు. 2025 ఆర్వోఆర్ చట్టం రూపకర్త, రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్, లీఫ్స్ సంస్థ భూ న్యాయ నిపుణులు పాల్గొంటారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన రైతులు సదస్సులో పాల్గొని తమ గ్రామ భూ సమస్యలు, రైతుల సమస్యలను వివరించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోరారు. తమ నియోజకవర్గం, గ్రామాల్లో స్వచ్చందంగా "రైతులకు ఉచిత న్యాయ సేవలు" అందించాలి అనుకునే వారికి లీఫ్స్, గ్రామీణ న్యాయ పీఠం సంస్థలు "భూ చట్టాలు - రైతు చట్టాలు" గురించి ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తుందన్నారు.

యోగ్యులకు సర్టిఫికెట్లు ఇచ్చి గ్రామాల్లో వాలంటీర్లుగా నియమించనున్నట్లు ప్రకటించారు. చట్టాలను రైతులకు చుట్టాలుగా మార్చడానికి రైతు ప్రేమికులు తోడుగా రావాలని కోరారు. మన కోసం రైతులు, రైతుల కోసం మనం, మేము సైతం రైతుల కోసం, రైతుల కోసం లాయర్లుగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. స్వచ్చందంగా రైతు అభివృద్ధి కోసం రూపకల్పన చేసిన ఈ ప్రోగ్రామ్స్ కి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story