- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో విద్యుత్ ఉత్పత్తి 74 శాతం బొగ్గుతోనే : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
విద్యుత్ చాలా కీలకమైన రంగంగా మారందని, ప్రజలకు ప్రాథమిక అవసరంగా మారింది దీనికి తగ్గట్లుగానే డిమాండ్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ చాలా కీలకమైన రంగంగా మారందని, ప్రజలకు ప్రాథమిక అవసరంగా మారింది దీనికి తగ్గట్లుగానే డిమాండ్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పవర్ జనరేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని,11 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం విద్యుదుత్పత్తి, విద్యుత్ సరఫరాపై సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో విద్యుదుత్పత్తిలో 74 శాతం బొగ్గు రంగం ద్వారా జరుగుతోందని ఎంత డిమాండ్ పెరిగినా తగ్గట్లుగా బొగ్గు అందజేసేందుకు మా మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణలో, ఏపీలో పారిశ్రామిక, గృహ, వ్యవసాయ అవసరాలకు విద్యుత్ కొరత ఉందని, కేంద్రం ఈ సమస్యలు లేకుండా అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తోందన్నారు. వన్ నేషన్, వన్ గ్రిడ్ పేరుతో దేశంలో ఎక్కడ విద్యుదుత్పత్తి జరిగినా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే విధంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలోనూ విద్యుత్ సరఫరాకు అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తోంది. రాష్ట్రంలో 5,15 లక్షల ఇండ్లకు ప్రధానమంత్రి సౌభాగ్యయోజన కింద విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తెలంగాణలో 4వేల మెగావాట్ల విద్యుత్ఉత్పత్తికి కేంద్రం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రానికి అన్నిరకాలుగా విద్యుత్ సంబంధిత అంశంలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోవడం దురదృష్టకరమన్నారు. వేలకోట్ల రూపాయల అప్పుల భారం ఈ విద్యుత్ సంస్థలు మోయలేక వాటి నడ్డి విరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విద్యుత్ సంస్థల దయనీయ పరిస్థితి గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేయగా వివిధ విద్యుత్ విభాగాలు, డిస్కంలు చెల్లించాల్సిన అప్పు రూ.30 వేల కోట్లకు పైగా ఉన్నట్లు తేలిందన్నారు.
ఒక్క సింగరేణి సంస్థకే దాదాపు రూ. 47వేల కోట్ల విద్యుత్ సంస్థలు బాకీ పడ్డాయి. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు ఆర్థికంగా సాధించిన అప్పుల ప్రగతి చాలా అద్భుతంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండగా విద్యుత్ఉత్పత్తి సంస్థల అప్పులు కూడా పెరుగుతున్నాయి. లక్ష మెగావాట్ల పవర్ డిమాండ్ పెరుగుతోందని దీనికి తగ్గట్లుగా విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీకి అవసరమైన మౌలికవసతులు రాష్ట్రంలో లేకపోవడం బాధకరమన్నారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం, రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు కనీస సహకారం కూడా అందించడం లేదు. అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ సమ్మిట్ లో గొప్పగా చెప్పారు. కానీ ఈ దిశగా రాష్ట్రప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నారు.
- Tags
- kishan reddy






