రాష్ట్రంలో జోరుగా ఉపాధి హామీ ప‌నులు

by Ajay Maddhiboyina |

తెలంగాణలో ఉపాధి హామీ ప‌నులు జోరుగా కొనసాగుతున్నాయి. కేంద్రం కేటాయించిన ఆరున్నర కోట్ల ప‌నిదినాల్లో ఇప్పటికే 4.53 కోట్ల ప‌ని దినాల‌ను తెలంగాణ పూర్తి చేసింది.

రాష్ట్రంలో జోరుగా ఉపాధి హామీ ప‌నులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఉపాధి హామీ ప‌నులు జోరుగా కొనసాగుతున్నాయి. కేంద్రం కేటాయించిన ఆరున్నర కోట్ల ప‌నిదినాల్లో ఇప్పటికే 4.53 కోట్ల ప‌ని దినాల‌ను తెలంగాణ పూర్తి చేసింది. అంటే మొత్తం కేటాయించిన ప‌నిదినాల్లో 70 శాతం టార్గెట్‌ను తెలంగాణ రీచ్ అయ్యింది.

28.48 ల‌క్షల మందికి ఉపాధి

ఈ ఏడాది ఇప్పటి వ‌ర‌కు 18.9 ల‌క్షల కుటుంబాల్లోని 28.48 ల‌క్షల మంది ఉపాధి కూలీల‌కు ప‌ని కల్పించారు. ఒక్కో కుటుంబం స‌గ‌టున‌ 24 రోజుల ప‌ని దినాల‌ను పూర్తయ్యాయి. 1,127 కుటుంబాలు వంద రోజుల ప‌నిదినాలను పూర్తి చేసుకున్నాయి. అయితే స‌గటున ఒక్కో కూలీకి రూ.250.75 రోజువారి వేత‌నం ల‌భిస్తోంది. అయితే రోజు వారి వేత‌నం రూ.307 ద‌క్కెలా చ‌ర్యలు తీసుకుంటున్నారు.

60 శాతం వ్యవసాయ అనుబంధ పనులు

ఉపాధి హామీ ప‌నుల్లో 60 శాతం వ్యవ‌సాయ అనుబంధ ప‌నులు చేయించాల‌ని లక్ష్యం పెట్టుకోగా.. 50 శాతం చేరుకున్నారు. ఫాంపాండ్స్, ప‌శువుల కొట్టాలు, మొక్కలు నాటడం వంటి ప‌నులు ల‌క్షకుపైగా కొనసాగుతున్నాయి. జీపీ, అంగ‌న్‌వాడీ భ‌వ‌నాలు, సీసీ రోడ్ల వంటి మౌలిక వ‌స‌తుల క‌ల్పన ప‌నులు ల‌క్షా 31 వేల‌కుపైగా ప్రగతిలో ఉన్నాయి.

కేంద్రానికి మంత్రి సీతక్క లేఖ

మే నెల ముగిసే నాటికి ఉపాధి హామీ లో భాగంగా రూ.1,416 కోట్లను ప్రభుత్వం ఖ‌ర్చు చేసింది. అందులో రూ.1,151.67 కోట్లు వేత‌నాలు కాగా, రూ.191.03 కోట్లు మెటీరి య‌ల్ కాంపోనెంట్‌గా న‌మోదు అ య్యింది. అయితే కేంద్రం నుంచి నిధుల విడుద‌ల‌లో జాప్యం అయినా కూలీల‌కు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిక‌ప్పుడు వేత‌నాల‌ను ఉపాధి కూలీల ఖాతాల్లో జ‌మ‌చేస్తోం ది. ఇప్పటి వ‌ర‌కు కూలీల ఖాతాల్లో రూ.733.52 కోట్లు జ‌మ అయ్యాయి. అయితే ఉపాధి హామీ ప‌నుల‌కు తెలంగాణ‌లో భారీ డిమాండ్ ఉంది. గ‌త ఏడాదితో పోలిస్తే ఉపాధి ప‌నిదినాల‌ను కేంద్ర ప్రభుత్వం స‌గానికి కుదించింది. దీనిపై త‌న అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీత‌క్క ఇప్పటికే లేఖ రాశారు. అపాయింట్‌మెంట్ రాగానే కేంద్ర పెద్దల‌ను క‌లిసి ఉపాధి ప‌ని దినాల‌ను క‌నీసం 12 కోట్లకు పెంచాల‌ని విజ్ఞప్తి చేయ‌నున్నారు.

Next Story