పంచాయతీ ఎన్నికలకు నోచుకోని 7 గ్రామాలు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో నేడు తుది విడ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ రోజుతో పంచాయితీ ఎన్నిక‌ల ప‌ర్వం ముగియ‌నుంది. ఈ నెల 11న మొద‌టి విడత ఎన్నిక‌లు జ‌ర‌గ్గా 14న రెండో విడత ఎన్నిక‌లు జ‌రిగాయి.

పంచాయతీ ఎన్నికలకు నోచుకోని 7 గ్రామాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నేడు తుది విడ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ రోజుతో పంచాయితీ ఎన్నిక‌ల ప‌ర్వం ముగియ‌నుంది. ఈ నెల 11న మొద‌టి విడత ఎన్నిక‌లు జ‌ర‌గ్గా 14న రెండో విడత ఎన్నిక‌లు జ‌రిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స‌ర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. కాంగ్రెస్ త‌ర‌వాత ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ బ‌ల‌పర్చిన అభ్య‌ర్థులు విజ‌యం సాధించి రెండో స్థానంలో నిలిచారు. అయితే రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ల్లెలన్నీ పంచాయితీ ఎన్నిక‌ల‌తో సంద‌డిగా మారితే నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో మాత్రం ఏడు గ్రామాలు ఎన్నిక‌ల‌కు దూరం అయ్యాయి.

త‌మ సమ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి అంటూ గ్రామ‌స్తులు ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించారు. చార‌కొండ మండ‌ల ప‌రిధిలోని ఎర్ర‌వ‌ల్లి, ఎర్ర‌వ‌ల్లి తండా ప్ర‌జ‌లు త‌మ‌కు ఎన్నిక‌లు వ‌ద్ద‌ని చెబుతున్నారు. డిండీ నార్లాపూర్ ఎత్తిపోతల పథకం కింద నిర్మించ తలపెట్టిన జలాశయం వల్ల తమ గ్రామాలు ముంపునకు గురవుతాయనే భయంతో ప్ర‌జ‌లు ఎన్నిక‌లు బ‌హిష్కరిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. గ్రామ‌స్తులు అంతా నిరాహార దీక్ష‌లో కూర్చుని న్యాయం కోసం నేను సైతం అంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

Next Story