- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్ ప్రక్రియ డిజిటలైజేషన్ 60 శాతం పూర్తి: CEO సుదర్శన్ రెడ్డి
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ 60 శాతం పూర్తయిందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇప్పటి వరకు ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‍చెరు నియోజకవర్గంలోని సుల్తాన్‍పూర్, ఐలాపూర్, పటాన్‍చెరులో ఎస్ఐఆర్ శిబిరాలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి పరిశీలించారు. సర్ గడువు పొడిగింపు తేదీని దృష్టిలో ఉంచుకుని ప్రక్రియను కొనసాగించాలని బీఎల్వోలకు ఈ సందర్భంగా సూచించారు. గ్రామాల్లో 80 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శళాతం ఎస్ఐఆర్ పూర్తయిందని చెప్పారు. ఎన్యూమరేషన్ పత్రాలు అందని వారు సర్ ప్రక్రియ సూపర్ వైజర్లను అడిగి పత్రాలు తీసుకోవాలని చెప్పారు.
గడువు పెంచిన ఈసీ:
కాగా రాష్ట్రంలో సర్ సర్వే షెడ్యూల్ లో కేంద్ర ఎన్నికల కమిషన్ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందించే గడువ ఈ నెల 24వ తేదీ వరకు ఉండగా దాన్ని ఆగస్టు 3 వరకు పెంచింది. ముసాయిదా జాబితా ప్రచురణ వచ్చే నెల 10కి, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణను ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు, వివరాల్లో తేడాలున్న ఓటర్లకు నోటీసులు ఇచ్చే సమయం ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు, తుది జాబితా అక్టోబర్ 12వ తేదీకి మార్చింది.






