- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గణేశ్ నిమజ్జనానికి 535 స్పెషల్ బస్సులు : టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్‌లో ఈనెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడపనుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఈనెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడపనుంది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం రెతిఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించగలరని సూచించారు.
- Tags
- TSRTC Bus
Next Story






