- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక ఆకర్షణగా ఆ 500 మంది
by Kodari Anjali |
కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (డిసెంబరు 7) ఎల్‌బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే

X
దిశ, వెబ్‌డెస్క్: కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (డిసెంబరు 7) ఎల్‌బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ కీలక ఘట్టానికి కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ముఖ్య అతిథితులుగా పాల్గొననున్నారు. దాదాపు లక్షా 30 వేల మంది కాంగ్రెస్ శ్రేణులు కూర్చునేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని పార్టీ భావించింది. ఈ క్రమంలోనే దాదాపు 500 మంది కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలతో చేయించనున్నారు. ఇప్పటికే కళాకారులను సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Next Story






