- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో సంచార జాతులుగా 50 కులాలు.. ప్రభుత్వానికి సిఫారసుల నివేదికను ఆమోదించిన బీసీ కమిషన్
తెలంగాణ రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా గుర్తిస్తూ, ప్రభుత్వానికి తన సిఫారసుల నివేదికను తెలంగాణ బీసీ కమిషన్ ఆమోదించింది. ఈ కులాలకు సంబంధించిన సర్టిఫికేట్ జారీలో చేపట్టే మార్పులు, చేర్పులపై ప్రభుత్వానికి సిఫారసులను ఆమోదించిందినట్లు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా గుర్తిస్తూ, ప్రభుత్వానికి తన సిఫారసుల నివేదికను తెలంగాణ బీసీ కమిషన్ ఆమోదించింది. ఈ కులాలకు సంబంధించిన సర్టిఫికేట్ జారీలో చేపట్టే మార్పులు, చేర్పులపై ప్రభుత్వానికి సిఫారసులను ఆమోదించిందినట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కార్యక్రమాలపై చర్చ జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న సీడ్ పథకానికి అర్హులకు కావాల్సిన డిఎన్‌టి సర్టిఫికేట్ జారీ విధివిధానాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రభుత్వ సంస్థల్లో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల్లో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ మినహా మిగతా అన్ని శాఖల నుండి కమిషన్‌కు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని క్రోడికరించి ఉద్యోగరంగంలో బీసీల స్థితిగతులను అంచనా వేయడానికి ఉపయోగించనున్నారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్క్ష్మి మరియు కమిషన్ మెంబర్ సెక్రెటరీ బాల మాయ దేవిలతో పాటు అధికారులు పాల్గొన్నారు.






