- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yadagirigutta : యాదగిరిగుట్టలో 5 కోట్ల మోసం !
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట(Yadagirigutta)లో ఓ బంగారం దుకాణం యాజమాని(Gold Shop Owner) బంగారాన్ని తాకట్టు పెట్టుకుని 5కోట్ల మేరకు మోసగించి ఉడాయించి(Absconding)న వైనం సంచలనం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట(Yadagirigutta)లో ఓ బంగారం దుకాణం యాజమాని(Gold Shop Owner) బంగారాన్ని తాకట్టు పెట్టుకుని 5కోట్ల మేరకు మోసగించి ఉడాయించి(Absconding)న వైనం సంచలనం రేపింది. జై భవాని బంగారు షాపు నిర్వహిస్తున్న మార్వాడీ జితేందర్ సింగ్(Jitender Singh)పాత బంగారం కుదవ పెట్టుకుని అప్పులివ్వడంతో పాటు కొత్త బంగారం కూడా విక్రయిస్తుంటాడు.
పదేళ్లుగా అతను జై భవాని జ్యుయలర్స్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో జితేందర్ సింగ్ ను నమ్మి స్థానికులు పెద్ద సంఖ్యలో తమ బంగారాన్ని కుదవ పెట్టుకోవడం, కొత్త బంగారం కావాలనుకునే వారు అడ్వాన్స్ డబ్బులివ్వడం చేశారు. ఆకస్మాత్తుగా జితేందర్ సింగ్ బోర్డు తిప్పేసి కనిపించకుండా పరారయ్యాడు. ఫోన్ స్విచాప్ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితులు జితేందర్ షాపు ముందు ఆందోళన చేశారు. గతంలో జితేందర్ పనిచేసిన దుర్గా జ్యుయలర్స్ షాపును కూడా ముట్టడించి జితేందర్ సింగ్ ఆచూకీ కోసం డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు దుర్గా జ్యుయలర్స్ ను మూసివేయించారు. కుదవ పెట్టిన బంగారంతో పాటు కొత్త బంగారం కోసం ఇచ్చిన అడ్వాన్స్ సొమ్ము, స్థానికుల వద్ధ చేసిన అప్పుల డబ్బులు సహా దాదాపు రూ.5కోట్ల మేరకు మోసం చేసి జితేందర్ సింగ్ పరారైనట్లుగా బాధితులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ రమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






