- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలిరోజే 4,797 టెట్ దరఖాస్తులు..
తెలంగాణ టెట్ (TG TET) జూన్ 2026 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET - జూన్ 2026) దరఖాస్తుల ప్రక్రియ ఉత్సాహంగా ప్రారంభమైంది. అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మొదటి రోజే భారీ స్పందన లభించింది. బుధవారం సాయంత్రం 7:30 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,797 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
పేపర్-2 కే మొగ్గు..
మొదటి రోజు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే, అత్యధికంగా పేపర్-2కు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పేపర్-1కు 1,072 దరఖాస్తులు రాగా, పేపర్-2కు 2,888 దరఖాస్తులు వచ్చాయి. ఇక రెండు పేపర్లకు 837 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. గడువు ముగిసే సమయానికి దరఖాస్తుల సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






