మెగా సరెండర్.. తెలంగాణ టీజీపీ ఎదుట 47 మంది మావోయిస్టుల లొంగుబాటు

by Prasad Jukanti |   (  Updated:2026-04-25 11:17:51  IST  )

తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోయిస్టుల లొంగుబాటు. 34 ఆయుధాల అప్పగింత. మావోయిస్టు పార్టీ పతనావస్థలో ఉందని తెలిపిన డీజీపీ.

మెగా సరెండర్.. తెలంగాణ టీజీపీ ఎదుట 47 మంది మావోయిస్టుల లొంగుబాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‍గఢ్ బెటాలియన్ -1 కు చెందిన కమాండర్ హేమ్లా విజ్జ అలియాస్ ఐతు సహా 47 మంది మావోయిస్టులు ఇవాళ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా 32 ఆయుధాలు పోలీసులను మావోయిస్టులు పోలీసులకు అప్పిగించారు. ఈ సరెండర్‍కు సంబంధించి మీడియాతో మాట్లాడిన డీజీపీ శివధర్ రెడ్డి.. ఈ లొంగుబాటుతో ఛత్తీస్‍గఢ్ బెటాలియన్-1 పూర్తిగా లొంగిపోయినట్లుగా డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు తెలిపారు. వీరి వద్ద నుంచి ల్యాండ్ మైన్లలో వాడే వైర్లు 3 బండిళ్లు స్వాధీనం చేసుకున్నామని సౌత్ బస్తర్ డివిజన్‍కు చెందిన కీలక మావోయిస్టు లొంగిపోయారని తెలిపారు. ఇవాళ లొంగిపోయిన వారిలో తెలంగాణ వాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. అయితే వీరిలో తెలంగాణ వారు ఎవరూ లేకపోయినా తెలంగాణలో వీరు కార్యాకలాపాలు సాగించినట్లు డీజీపీ తెలిపారు. లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీ అందిస్తామని అలాగే అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా అందిస్తామన్నారు.

తెలంగాణ పోలీసుల కృషికి ప్రశంసలు:

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసులు అంకితభావం, సమన్వయంతో చేసిన కృషిని డీజీపీ ప్రశంసించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసులు వృత్తిపరమైన నైపుణ్యంతో నిరంతరం చేసిన కృషి వల్ల నలబై ఏడు మంది అజ్ఞాతం వీడారని తెలిపారు. ఇవాళ లొంగిపోయిన మావోయిస్టు క్యాడర్ల సంఖ్య, వారు అప్పగించిన ఆయుధాలను బట్టి చూస్తే మావోయిస్టు పార్టీ క్రమంగా క్షీణించడమే కాకుండా సంపూర్ణంగా పతనం అయిందనే విషయం స్పష్టం అవుతోందన్నారు. 2026 సంవత్సరంలో ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 260 మంది అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు.

తెలంగాణ నుంచి మిగిలింది నలుగురే:

తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టు కేడర్ లు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉండి తెలంగాణ వెలుపల వివిధ నిర్మాణంలో పని చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ నలుగురు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ లో కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిపారు.

Next Story