Indiramma houses : మిడ్ మానేరు నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్లు

by Y. Venkata Narasimha Reddy |

Indiramma houses : మిడ్ మానేరు నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : మిడ్ మానేరు (Mid Maneru) నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇండ్ల(Indiramma houses) ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్మాణంతో 12గ్రామాలకు చెందిన నిర్వాసితులు 10,683మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇండ్లను మంజూరీ చేయాల్సి ఉంది. గతంలో 5,987మందికి ఇండ్లను నిర్మింపచేయగా, మిగిలిన 4,696మందికి తాజాగా ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు చేసింది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద స్టేట్ రిజర్వ్ కోటాలో నిర్వాసితులకు ఇండ్ల నిర్మాణం కోసం రూ.5లక్షల చొప్పున మంజూరీ చేసింది.

వెంటనే ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీకి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తూ ఆర్అండ్ బీ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాశ్ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో నిర్వాసితులు గత ప్రభుత్వ హయాం నుండి పునరావాసం కింద ఇండ్లను మంజూరు చేయాలని పడుతున్న ఎదురుచూపులు ఫలించినట్లయ్యింది.

Next Story