- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RTC strike: ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు 45 రోజుల డెడ్ లైన్
ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ డెడ్ లైన్ విధించింది.

దిశ, డైనమిక్ బ్యూరో/రాంనగర్: తెలంగాణ ఆర్టీసీ (TG RTC) లో సమ్మె ఛాయలు కనిపిస్తున్నాయి. తాజాగా యాజమాన్యానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. సోమవారం హైదరాబాద్ లోని ఆర్టీసీ భవన్ లో ఆర్టీసీ జేఏసీ నాయకులు (RTC JAC) ఆర్టీసీ ఉన్నతాధికారిని కలిసి సమ్మె నోటీసు (RTC strike notices) అందజేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లింపులు వంటి తదితర అంశాలతో పాటు మొత్తం 21 డిమాండ్లతో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేందుకు 45 రోజుల గడువు ఇస్తున్నామని ఆలోపు పరిష్కారం చూపకపోతే వచ్చే నెల 9న లేదా ఆ తర్వాత మొదటి డ్యూటీ నుంచి రాష్ట్రంలోని అన్ని డిపోలలోని కార్మికులమంతా సమ్మెబాట పడతామని నోటీసుల్లో హెచ్చరించారు. కాగా సమ్మె నోటీసు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
ఎలక్ట్రిక్ బస్సు వారికి ఆర్టీసికి సంబంధమే లేదు:
ఆర్టీసీలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో అద్దె వాహనాలను తీసుకువస్తున్నారు. ఈ బస్సు, అందులో పని చేస్తున్న డ్రైవర్ ఆర్టీసికి సంబంధం లేనివని జేఏసీ సమ్మె నోటీసుల్లో పేర్కొంది. ఈ బస్సు మీద ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ప్రైవేటు వ్యక్తులకే చెందుతోంది. అందువల్ల ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసి అందజేయాలని అప్పుడు మాత్రమే ఆర్టీసీ ప్రవేటీకరణకు దారి మూసుకుపోయే అవకాశం ఉంటుందన్ని, ఆర్టీసీ డీజీల్ ఫస్సులను రెట్రో ఫిట్ మెంట్ పాలసీపై ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే విధానాన్ని మానుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న జీవో 961 జారీ చేయసి ఏళ్లు గడుస్తున్నా ఆ సమస్య ఇంకా పరిష్కారం కావడం లేదని వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కండక్టర్, డ్రైవర్లు తమ ఉద్యోగ విషయంలో అభద్రతా భావానికి లోనవుతున్నారని వారిపై మేనేజిమెంట్, చెకింగ్ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని దాంతో అనేక మంది పని ఒత్తడితో డ్యూటీలోనే గుండెపోటుతో పక్షవాతానికి గురై స్టీరింగ్ మీదనే ప్రణాలు వదిలిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. కార్మికుల సమస్యల సత్వర పరిష్కారానికి మేనేజ్ మెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలని సమ్మె నోటీసుల్లో పేర్కొన్నారు.






