- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మద్యం షాపులకు 447 దరఖాస్తులు.. సోమవారం నుంచి భారీగా వచ్చే చాన్స్!
డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నూతన మద్యం దుకాణాలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇటీవల నోఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నూతన మద్యం దుకాణాలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇటీవల నోఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులు సెప్టెంబర్ 26 నుంచి స్వీకరిస్తున్నారు. శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 447 దరఖాస్తులు వచ్చినట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచి అప్లికేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మేడ్చల్ యూనిట్ పరిధిలో ఉన్న 118 మద్యం దుకాణాలకు 20 అప్లికేషన్లు వచ్చాయి. అక్టోబరు 18 వరకు స్వీకరణకు గడువు ముగుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు నిర్వహకుల ఎంపిక అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో చేపట్టనున్నారు. దరఖాస్తు ఫారంతో పాటు రూ.3 లక్షల డీడీ, లేదా రూ. 3 లక్షలు చలాన్ రూపంలో చెల్లించిన రశీదు జతపరచాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. 2,620 మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం ఎస్టీలకు 5 శాతంగా రిజర్వేషన్లు కేటాయించారు. డీడీలు, చలాన్లను డీపీఓ (జిల్లా ప్రొహిబిషనర్ అండ్ ఎక్సైజ్ అధికారి) పేరున తీయాల్సి ఉంటుందని తెలిపారు. రిజర్వేషన్లు, దరఖాస్తు గైడ్‌లైన్స్ వివరాలను tgbcl.telangana.gov.in అధికారిక వెడ్‌సైట్‌లో పోందుపరచినట్లుగా ఎక్సైజ్ శాఖ తెలిపింది.






