తెలంగాణ‌లో ప‌లువురు డీఎస్పీల బ‌దిలీ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-28 12:26:10  IST  )

తెలంగాణ‌లో ప‌లువ‌రు డీఎస్పీ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఒకేసారి 40మందిని బ‌దిలీ చేశారు. ఈ మేర‌కు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ‌లో ప‌లువురు డీఎస్పీల బ‌దిలీ
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో నలభై నాలుగు మంది డీఎస్పీ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ మేర‌కు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ నాగాశ్వ‌ర్ రావు డీజీ కంట్రోల్ రూం నుండి సీసీఎస్ హైద‌రాబాద్‌కు ఏసీపీగా బదిలీ అయ్యారు. ఆకుల చంద్రశేఖర్‌ను మహేశ్వరం ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ చేశారు. సాయి రెడ్డి వెంకట్ రెడ్డిని డీజీ కంట్రోల్ రూం నుండి ఎస్డీపీఓగా కల్వకుర్తికి బదిలీ చేశారు. కొంతం చంద్రశేఖర్ రెడ్డిని మెదక్ నుండి మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ చేశారు. ఎన్‌సీ రంగస్వామిని సీఐడీ డీఎస్పీగా బదిలీ చేశారు. అదే విధంగా ఏసీపీ సంపత్ కుమార్‌ను రాచకొండ కమాండ్ కంట్రోల్‌కు ఏసీపీగా బదిలీ చేశారు.














Next Story