- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: 44 మంది ఏఈఈలకు ప్రమోషన్లు
తెలంగాణ పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్(టీపీహెచ్ఎంఈ) విభాగంలోని 44 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినర్ల(AEE)కు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు(DEE)గా ప్రమోషన్లు కల్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్(టీపీహెచ్ఎంఈ) విభాగంలోని 44 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినర్ల(AEE)కు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు(DEE)గా ప్రమోషన్లు కల్పించారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ల సమస్య కొలిక్కి వచ్చింది. దీంతోపాటు ప్రమోషన్లు పొందిన 20డీఈఈలకు జీహెచ్ఎంసీలో పోస్టింగ్ ఇచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీ డవలప్ మెంట్ ఆథారిటీ(ఎఫ్సీడీఏ)లో ఒకరు, హైడ్రాలో ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన నిజామాబాద్, రామగుండం, వనపర్తితోపాటు ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డీఈఈలకు పోస్టింగ్ ఇచ్చినట్టు ఈఎన్సీ ఎస్.భాస్కర్ రెడ్డి తెలిపారు. డీఈఈ నుంచి ఈఈ, ఈఈ నుంచి ఎస్ఈ లకు సంబంధించిన ప్రమోషన్లను సైతం ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు :
పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగానికి 453మంది ఇంజినీర్లు కావాలని రాష్ట్రప్రభుత్వానికి గతంలో లేఖ రాశారు. అయితే జనాభా పెరుగుదల, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్ గ్రేడ్ చేసిన సందర్భంగా అదనపు పోస్టుల కోసం మరోసారి ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఇంజినీర్లను ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతోపాటు ఆర్థికశాఖ క్లియరెన్స్ కూడా ఇచ్చింది.






