రక్షణశాఖకు 435 ఎకరాల హెచ్ఎండీఏ భూములు !

by velandi.Saikiran |

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయని, రక్షణ శాఖకు

రక్షణశాఖకు  435 ఎకరాల హెచ్ఎండీఏ భూములు !
X
  • రక్షణశాఖకు 435 ఎకరాల హెచ్ఎండీఏ భూములు
  • రిజర్వ్ ఫారెస్ట్ భూములకు బదలు రెవెన్యూ
  • త్వరలో పట్టాలెక్కనున్న ఎలివేటెడ్ కారిడార్ల పనులు
  • 4స్కైవాక్స్ నిర్మాణానికి చర్యలు
  • ఫైళ్లు పెండింగ్ అవాస్తవం
  • మీడియాతో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్


దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయని, రక్షణ శాఖకు సంబంధించిన భూములను హెచ్ఎండీఏకు బదలాయించడానికి ఒప్పందం చేసుకోవడం కీలక పరిణామమని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. అమీర్ పేట్ లోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంలో రక్షణశాఖకు చెందిన 142 ఎకరాల సేకరించడంతో తిరిగి రక్షణశాఖకు జవహార్ నగర్ లోని 435 ఎకరాల హెచ్ఎండీఏ భూములను ఇవ్వనున్నట్టు తెలిపారు. రావిర్యాల రతన్ టాటా ఇంటర్ ఛేంజ్ నుంచి ఆమన్ గల్ వరకు నిర్వహించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, కోర్టు కేసుల కారణంగా పనులు ప్రారంభించలేదన్నారు. ఈ ప్రాజెక్టులో 231 రిజర్వ్ ఫారెస్టు భూములను సేకరించామని, వీటికి బదులుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలోని రెవెన్యూ భూములు ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.

ఆదాయ వనరులు పెంచడానికి…

కొత్తగా మూడు ప్రాంతాలైన కంది, ఫసల్ వాడీ, పెద్ద కంజర్లలో హెచ్ఎండీఏ లేఅవుట్లను అభివ్రుద్ధి చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే ప్రతాపసింగారం, బాచుపల్లి, ఇనుముల్ నర్వ, లేమూరు ప్రాంతాల్లో లేఅవుట్లను అభివ్రుద్ది చేశామని తెలిపారు. రైతులతో చర్చించి భూములు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతోపాటు హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ, అసైన్ భూములను సేకరించి పెద్ద పెద్ద లేఅవుట్లు చేయాలనే భావిస్తున్నామని చెప్పారు. హెచ్ఎండీఏకు చెందిన భూములు, లేఅవుట్లలో 10శాతం మార్జ్ గేజీ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని పరిరక్షించడంతోపాటు రెంట్, లీజ్ వంటి విధానంలో ఆదాయాన్ని రాబట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

4స్కైవాక్స్ ఏర్పాటుకు చర్యలు..

నగరంలో నాలుగు స్కైవాక్స్ ఏర్పాటు చేయానికి హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మెట్రోరైలు ప్రాజెక్టు ఈస్ట్, వెస్ట్ స్టేషన్లతోపాటు రేతిఫైల్, సికింద్రాబాద్, కీస్ హైస్కూల్ బస్టాప్ లను కలిపేవిధంగా స్కైవాక్ రూపొందించామని చెప్పారు. కూకట్ పల్లి జేఎన్టీయూ నుంచి మెట్రోస్టేషన్ వరకు, జేఎన్టీయూ నుంచి ప్రగతి నగర్ మార్గంలో వెళ్లేందుకు పాదచారుల కోసం స్కైవాక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఉప్పల్ వెళ్లే మార్గం(ఎడమ)లో శ్మశాకవాటిక ఉండడంతో స్కైవాక్ ఏర్పాటు చేయకలేకపోయామని, దీంతో ప్రమాదాలు జరుగుతుండడంతో అక్కడ కూడా స్కైవాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. మెహిదీపట్నం స్కైవాక్ ను ఆగస్టు 15న ప్రారంభించనున్నట్టు తెలిపారు.

2026లోనే మాస్టర్ ప్లాన్…

హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 పనులు 2026ఏప్రిల్/మే మాసాల్లో పూర్తికానుందని కమిషనర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ఎకానమిక్ డవపల్ మెంట్ ప్లాన్, బ్లూ, గ్రీన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్లాన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఎకానమిక్ డవపల్ మెంట్ ప్లాన్ కు సంబంధించిన అనేక రకాల సలహాలు, సూచనలు వచ్చాయని చెప్పారు.

ఫైళ్లు పెండింగ్ అవాస్తవం…

హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్లు, ఆక్యూపెన్సీ(ఓసీ) సర్టిఫికెట్లకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని ప్రచారం జరుగుతున్నదని, ఇందులో ఏ మాత్రం వాస్తవంలేదని, అందుకు ఇచ్చిన పర్మిషన్లే నిదర్శనమని చెప్పారు. గత రెండేండ్లతో పొలిస్తే ఈ ఏడాదిలో జూన్ వరకు అధిక దరఖాస్తులను క్లియర్ చేశామని చెప్పారు.

కొత్త రోడ్లు, పార్కులు..

హెచ్ఎండీఏకు సంబంధించిన లేఅవుట్లలోని స్థలాల్లో కొత్తగా పార్కులను ఏర్పాటు చేశామని, మరిన్ని పార్కులను సైతం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 19 కొత్త పార్కులను ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తించినట్టు తెలిపారు. పలు కాలనీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Next Story