Talasani Srinivas Yadav : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

by Y. Venkata Narasimha Reddy |
Talasani Srinivas Yadav : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తాం.. నిలదీస్తామని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Former Minister Talasani Srinivas Yadav) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ నాయకుల సమావేశం(BC leaders meeting)లో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.

కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్‌పై తీర్మానం కాదు..చట్టబద్ధత కల్పించాలన్నారు. కాంగ్రెస్ పాలనలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అణచివేయబడ్డారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోనే వెనుకబడిన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందారన్నారు. 2014లోనే కేంద్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణలపై కేసీఆర్ ప్రభుత్వం తీర్మానం పంపిందన్నారు.

కాంగ్రెస్ నిర్వహించిన కులగణన సర్వే అంతా తప్పుల తడక అని, తప్పుడు సర్వేతో మోసం చేసే కుట్రలు చేస్తుందని విమర్శించారు.కాంగ్రెస్‌కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Next Story