20 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు 4వేల కోట్లు రిలీజ్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-27 17:06:06  IST  )

ప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు చేపట్టాలని కాంగ్రెస్​ప్రభుత్వం సంకల్పించింది.

20 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు 4వేల కోట్లు రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు చేపట్టాలని కాంగ్రెస్​ప్రభుత్వం సంకల్పించింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా సాధారణ సమాజంతో సహా అన్ని సామాజిక నేపథ్యం నుండి వచ్చిన విద్యార్థులకు అధిక-నాణ్యత సౌకర్యాలను అందించడం లక్ష్యంగా ప్రభుత్వ ముందుకెళుతుంది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా స్కూళ్ల నిర్మాణాల కోసం నిధులు విడుదల చేసింది. ఈమేరకు మంగళవారం 4వేల కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 20 స్కూళ్లకు గాను ఒక్కో స్కూల్ కు 200 కోట్లు మొత్తంగా 4వేల కోట్లును కేటాయించింది.

నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు..

––––––––––––––––––––––––––––––––

Next Story